హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరిట మరో వైబ్ సైట్ వచ్చింది. ఇది పూర్తిగా తెలుగులో ఉండడమే విశేషం. 'నమోర మీడియా ప్రైవేటు లిమిటెడ్' సంస్థ తెలుగులో ఓ వెబ్ సైట్ ను రూపొందించింది. వైయస్సార్ గౌరవార్థం చిరు కానుకగా ఆ సంస్థ అధినేత రాజేశ్ నంబూరు రూపొందించిన www.ysrintelugu.com వెబ్ సైట్లను యువనేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలుగు సాఫ్ట్‌వేర్‌ని సపోర్ట్ చేసే కంప్యూటర్లలో ఈ సైట్ ను తెలుగులో టైప్ చేసి(www.వైఎస్ఆర్.com)కూడా వీక్షించవచ్చని రాజేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.