మొండికేసిన చంద్రబాబు: ఐటిఐ కళాశాలలోనే నిద్ర

నాలుగు రోజులు ఇక్కడే ఉన్నా బాబ్లీని సందర్శించనివ్వబోమని అశోక్ చవాన్ చంద్రబాబుతో చెప్పారు. తాను బాబ్లీ చూడాల్సిందేనని చంద్రబాబు భీష్మించుకుని కూర్చున్నారు. చంద్రబాబుది రాజకీయమని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ అన్నారు. ఈ స్థితిలో చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులు ఐటిఐ కళాశాలలోనే ఉన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐటిఐ కళాశాల వద్ద పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications