హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడువి కుట్ర, నీచ రాజకీయాలు: సిఎం రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివి కుట్ర, నీచ రాజకీయాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన విమర్శలపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రబాబు ఏమిటో, తానేమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలియడంతో చంద్రబాబుపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఒక రాష్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. చంద్రబాబు మానసిక స్థితి చూసి జాలేస్తోందని ఆయన అన్నారు.

చంద్రబాబులా దిగజారే నీచప్రవృత్తి తనకు లేదని ఆయన అన్నారు. ఔరంగబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకుని వస్తే తమది కుట్ర అని చంద్రబాబు అంటారా అని ఆయన అడిగారు. ప్రత్యేక విమానానికి అయిన ఖర్చును చంద్రబాబు చెల్లిస్తే రాష్ట్ర ఖజానాకు చెల్లిస్తామని ఆయన అన్నారు. ఓపికతో ఉంటే నోటికి వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అధికారం కోసం కుటుంబ సభ్యులను జైల్లో పెట్టినవారి గురించి చరిత్రలో చూశామని, ఆ తర్వాత చంద్రబాబునే చూశామని ఆయన అన్నారు. చిన్నపిల్లవాడిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X