చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో తలకిందులుగా జాతీయ జెండా

Prajarajyam
హైదరాబాద్: హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాతీయ పతాక ఆవిష్కరణలో అపశ్రుతి దొర్లింది. మువ్వన్నెల పతాకం ఒకసారి కిందపడిపోతే మరోసారి తలకిందులుగా ఎగిరింది. ప్రజారాజ్యం నేత, సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆదివారం అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ క్రమంలో తాడుతో సహా జెండా జారిపోయి కింద పడింది. దీంతో బిత్తరపోయిన సిబ్బంది హడావుడిగా దాన్ని సరిచేశారు.

ఆ తర్వాత అల్లు అరవింద్ పతాకాన్ని మళ్లీ ఆవిష్కరించారు. ఈ సారి జెండా తలకిందులుగా ఎగిరింది. అలాగే వందన సమర్పణ కూడా చేసేశారు. ఈ లోపు పొరపాటు గ్రహించి మళ్లీ సరిచేసి ఎగురవేశారు. ఈ విషయమంతా టీవీ చానళ్లలో మార్మోగి పోవడంతో బ్లడ్‌బ్యాంక్ అధికారులు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చుకున్నారు. మానవ తప్పిదంతో జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తున్నామని, బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు బ్లడ్‌బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+