మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి: త్వరలో షూటింగ్?

చిరంజీవి కోసం ఇప్పటికే స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తయారై ఉంది. ఆయన ఆదే సినిమాలో నటిస్తారా, మరేదైనా సాంఘిక చిత్రం ఎన్నుకుంటారా అనేది తెలియడం లేదు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉండడంతో ఈలోగా మరో సినిమా తీయాలనేది ఆయన ఉద్దేశ్యమని చెబుతున్నారు. ఎన్నికలు వచ్చే నాటికి అది సిద్ధంగా ఉండాలని కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, చిరంజీవి నటించబోయే చిత్రానికి ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
చిరంజీవి కుటుంబ సభ్యలకు రెండు నిర్మాణ సంస్థలున్నాయి. అందులో ఒకటి అంజనా ప్రొడక్షన్స్ కాగా, మరోటి నియో ప్రాజెక్ట్స్. రామ్ చరణ్ తేజ నియో ప్రాజెక్ట్స్ కింద చిరంజీవితో సినిమా నిర్మిస్తారని అంటున్నారు. తండ్రి బర్త్ డే కానుకగా దాన్ని ఆయన చేపడతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications