చిరంజీవి పార్టీకి కాంగ్రెసులో విలీనం తప్పదా?

Chiranjeevi
విశాఖపట్నం: తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తమ పార్టీ కాంగ్రెసులో విలీనం కాదని, ఇదే తన ఆఖరి మాట అని చిరంజీవి విశాఖపట్నం ప్లీనరీ సమావేశంలో గంభీరంగానే చెప్పారు. అయితే పొత్తులుంటాయని మాత్రం చెప్పారు. అయితే, కాంగ్రెసులో తమ పార్టీ విలీనం కాదనే చిరంజీవి మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనమవుతుందనే అభిప్రాయమే రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినపిస్తోంది. దీనికి ప్రధాన కారణం చిరంజీవి వేస్తున్న అడుగులే కారణమని చెప్పవచ్చు.

తమకు కాంగ్రెసు పార్టీ రెడ్ కార్పెట్ పరిచిందని ఆయన అదే ప్లీనరీ సమావేశంలో మురిసిపోయారు. ఎన్ని మాటలు చెబుతున్నా విలీనం దిశగానే చిరంజీవి అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు. పార్టీని నిర్వహించడం చిరంజీవికి కష్టంగా మారింది. వ్యవస్థాగతమైన నిర్మాణం ఆయన వల్ల గానీ ఆయన బావ మరిది అల్లు అరవింద్ వల్ల గానీ కావడం లేదు. తనకు ఉన్న ఇమేజ్ ను పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో కూడా చిరంజీవి విఫలమయ్యారు. అయితే, కాంగ్రెసులో విలీనమైతే చిరంజీవి ఇమేజ్ ను, ఆయన సామాజిక వర్గం అనుకూలతను ఆ పార్టీ వ్యవస్థాగతం చేస్తుందనే అభిప్రాయం ఉంది. చంద్రబాబును దెబ్బ తీయాలంటే చిరంజీవి విలీనానికే మొగ్గు చూపాల్సి ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఉమ్మడి శత్రువు. అందువల్ల కూడా కాంగ్రెసుకు చిరంజీవి దగ్గరవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+