నెల్లూరు: హైదరాబాదులో కోడలిపై కీచక మామ లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం వెలుగు చూసిన మర్నాడే ఓ అల్లుడు అత్తను కామవాంఛ తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్న వైనం వెలుగులోకి చూసింది. నెల్లూరు జిల్లాలో కామేశ్వర్ రెడ్డి అనే ఓ అల్లుడు తన కామవాంఛ తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. అతడి బాధ తట్టుకోలేక ఆ మహిళ మీడియా ముందుకు వచ్చింది.
బాధితురాలు నీటి పారుదల శాఖలో ఉద్యోగిని. చాలా కాలంగా అల్లుడు కామేశ్వర్ రెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె చెప్పింది. అతడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.