వైయస్ జగన్ గురించి అన్నీ తెలుసన్న సోనియా గాంధీ

సోనియాకు శంకరరావు రెండు పేజీల నివేదిక ఇచ్చారు. అందులో జగన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రస్తావించారు. జగన్ ప్రవర్తిస్తున్న తీరు బాగా లేదని శంకరరావు విమర్సించారు. జగన్ అందరి పట్ల కూడా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ పై పార్టీ అధిష్టానం చర్య గురించి తానేమీ చెప్పలేనని, తగిన సమయంలో జగన్ పై చర్యలు తీసుకోవచ్చునని శంకర రావు అన్నారు. వైయస్ జగన్ అక్రమంగా సంపాదించారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద యెత్తున ఆస్తులు సంపాదించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications