భారత స్వాతంత్ర్య యుద్ధం స్ఫూర్తినిచ్చింది: బరాక్ ఒబామా

ప్రపంచంలోని అన్నీ మతాలు సమానమేనని ఇతరులను ఇబ్బంది పెట్టని రీతిలో మతాన్ని అవలంభించాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఆర్థిక ప్రగతి ప్రజలను పేదరికం నుంచి విముక్తి కలిగిస్తుందన్నారు. ఆరోగ్యకరమైన పోటీ ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఆధ్మాత్మికతో కూడిన జీవన విధానం ఉన్నత మార్గమని ఆయన అన్నారు. మయన్మార్‌లో ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఆహార భద్రత విషయంలో భారత్ అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్యానికి విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. ఆర్థికమాంద్యం కారణంగా ఆర్థికంగా అమెరికా దెబ్బతినిందన్నారు. ఉగ్రవాదం పాకిస్థాన్‌కే పరిమితం కాలేదన్నారు. విశ్వవ్యాప్తంగా ఇది వివిధరూపాల్లో ఉందన్నారు. ఆఫ్గనిస్థాన్‌లో ఇరాక్‌లో అనుసరించిన విధానాన్నే అవలంబించినట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications