రాజీనామాతో రాజకీయ జీవితం అంతం కాదు: అశోక్ చవాన్

తన రాజకీయ జీవితం ఇంకా ఉందని, కాంగ్రెసు నియమాలకు కట్టుబడి ఉన్నానని, అందుకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు త్వరలో తొలగిపోయి క్లీన్ చిట్ తీసుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. సోనియాగాంధీపై నాకు నమ్మకం ఉందని అన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో నాపై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమయినప్పటికీ అందులో నా పాత్ర లేదని, ఆ కుంభకోణంలో నాకు ఎలాంటి పాత్ర లేదన్నారు.
కాగా అశోక్ చవాన్ రాజీనామాను చేయటంతో ఆయన స్థానంలో పార్టీ అధిష్టానం మంగళవారం సాయంత్రం లోగా మరొకరిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని చూస్తుంది. మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశముఖ్, సుశీల్ కుమార్ షిండే, ముఖుల్ వాసిని తదితరులు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. పార్టీ అధిష్టానం వారి పేర్లను పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications