హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజా ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవికి దగ్గరవుతున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఆమె చిరంజీవికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రాజకీయంగా ఇప్పటికిప్పుడైతై వైయస్ జగన్ వెంట ఆమె ఉన్నప్పటికీ, జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ చిరంజీవి వైపు వెళ్లడానికి వెనకాడకపోవచ్చునని ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. జన్మదినం సందర్భంగా ఆమెను పలు టీవీ చానెళ్లు బుధవారం ఇంటర్వ్యూ చేశాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఆమె చిరంజీవికి అనుకూలంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో చిరంజీవిని ఐరన్ లెగ్ గా, మహిళల వ్యతిరేకిగా ఆమె ఆడిపోసుకున్నారు. అయితే, ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. సినిమాలో చిరంజీవితో స్టెప్పులు వేయడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పిన రోజా ఇప్పుడు రాజకీయంగా కూడా బలపరిచేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తోంది.

ఎవరు ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారని మీడియా ప్రశ్నిస్తే ఏ మాత్రం తడుముకోకుండా వైయస్ జగన్ అని చెప్పేశారు. అయితే ఆ వెంటనే సర్దుకున్నారు. రాజకీయంగా చిరంజీవి పరిణతి సాధించారని, చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పేశారు. దీన్ని బట్టి ఆమె అంతరంగమేమిటో అర్థమవుతోందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆమె చిరంజీవి 150వ చిత్రంలో నటించి తీరాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఆయనతో కలిసి పనిచేయడానికి వెనకాడకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X