తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కిరణ్ కుమార్

సమస్యలున్నప్పుడే మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. మంత్రివర్గం గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదని, ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానంతో మాట్లాడేకే తెలుస్తుందని అన్నారు. కిరణ్‌కు పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు. యువకుడైన ఆయన నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని దానం నాగేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యాహ్నమే మంత్రి గల్లా అరుణకుమారి కిరణ్‌ను ఆయన ఇంటివద్ద కలిశారు. కొత్త ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.












Click it and Unblock the Notifications