మాజీ నక్సలైట్ ఇంటిపై పోలీసుల దాడి, పేలుడు పదార్థాలు గుర్తింపు
Districts
oi-Srinivas G
By Srinivas
వరంగల్: వరంగల్ జిల్లాలో ఓ మాజీ నక్సలైట్ ఇంటిలో బాంబుపేలుడు పదార్థాలు దొరికాయి. జిల్లాలోని చిట్యాల మండలం తిరుమలాపురంలోని మాజీ మావోయిస్టు చంద్రమౌళి ఇంటిపై పోలీసులు అకస్మిక దాడి చేశారు. చంద్రమౌళి ఇంటిలో బాంబులు ఉన్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చినందునే ఆయన ఇంటిపై మెరుపు దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసులకు ఐదు నాటుబాంబులు, ఓ తుపాకి లభ్యమయ్యాయి. చంద్రమౌళిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటిలో బాంబులు ఎక్కడి నుండి తీసుకు వచ్చారు అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.