హారర్ చిత్రం చూసి గిరిజన హాస్టల్ లో విద్యార్థి మృతి
Districts
oi-Srinivas G
By Srinivas
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో హారర్ చిత్రం చూసి ఓ విద్యార్థి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్టణంలోని ఓ గిరిజన హాస్టల్లో చదువుతున్న ప్రభాకర్ అనే విద్యార్థి శనివారం అర్ధరాత్రి స్నేహితులతో కలిసి ఘోస్టు తదితర దెయ్యాల చిత్రాలు చూశారు. ఆ తర్వాత వారు నిద్రకు ఉపక్రమించారు. అయితే ఉదయం లేచి చూసేసరిని ప్రభాకర్ మరణించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. తమ కుమారుడి మృతికి పాఠశాల సిబ్బందే కారణమని ఆరోపించారు. భయంకర సినిమాలు చూసి మా అబ్బాయి చనిపోడని, సిబ్బందే తమ తనయుడి మృతికి కారణమని ఆరోపించారు. ఇదిలా ఉండగా హాస్టలు భవనంలోకి విద్యార్థులు సినిమాలు చూడడానికి టీవి, సిడి ప్లేయరు, సీడీలు ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యమే ప్రభాకర్ మృతికి కారణమని ఆరోపించారు.