ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దేవీ వరప్రసాద్ కన్నుమూత

Devi Vara Prasad
హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దేవీ వరప్రసాద్ కన్ను మూశారు. అస్వస్థతకు లోనే హైదరాబాదులోని కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు 68 ఏళ్లు. ఆయనకు రేపు శనివారం విజయవాడలో అంత్యక్రియలు జరుగుతాయి. రేపు మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్ కార్యాలయం వద్ద ఉంచుతారు. దేవీ ఫిలింస్ పతాకంపై ఆయన పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ప్రముఖ హీరోలందరితో ఆయన సినిమాలు నిర్మించారు.

భలే తమ్ముడు, మంచి దొంగ, ఘరానా మొగుడు, మృగరాజు, కొండవీటి రాజా, అల్లుడా మాజాకా, అమ్మ రాజీనామా వంటి సినిమాలు నిర్మించారు. ఆయన సినిమాలు విశేష ప్రజాదరణ పొందాయి. సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా ఆయన పేరు పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+