వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటాం: కంతేటి

వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆయన చెప్పారు. శాసనసభ్యులు చాలా మంది రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారని, రాజీనామాలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా శనివారం ముఖ్యమంత్రిని కలిశారు. రచ్చబండపై, పులివెందుల, కడప ఉప ఎన్నికలపై తాను ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications