డిఎల్, శంకర్‌రావులవి ఉత్తరకుమార ప్రగల్భాలు: జగన్ వర్గం నేత గోనె

Gone Prakash Rao
హైదరాబాద్: ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, చేనేత జౌళీ శాఖామాత్యులు శంకర్‌రావులవి ఉత్తర కుమార ప్రగల్భాలని మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్ వర్గం కాంగ్రెస్ నేత గోనె ప్రకాశ్‌రావు ఆదివారం ధ్వజమెత్తారు. డిఎల్క‌కు దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కడప జిల్లా వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలైన ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, శ్రీనివాసు తదితరుల రాజీనామాకు డిమాండ్ చేస్తున్న డిఎల్ దమ్ముంటే మొదట ఆయనే రాజీనామా చేయాలన్నారు.

కాగా గత కొంతకాలంగా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, జగన్ వర్గం శాసనసభ్యుల మధ్య రాజీనామాల సవాళ్లు ఉన్న విషయం తెలిసిందే. జగన్ ఢిల్లీ జలదీక్షలో మొదట డిఎల్ రాజీనామాకు పూనుకుంటే తాము సిద్ధమని జగన్ వర్గం ప్రకటించారు. స్పందించిన డిఎల్ జగన్ వర్గంతో అమీతుమీకి సిద్ధమయిన విషయం తెలిసిందే. తాను రాజీనామా పట్టుకొని ఉపసభాపతి దగ్గర ఉంటానని వారు రావాలని డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలు తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+