హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవమానం భరించలేకనే సూరిని హత్య చేసిన భాను కిరణ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ద్వారా వచ్చిన స్థిరాస్తులు, భూములు తన పేరు మీద రాయాలంటూ మద్దెలచెర్వు సూరి ఒత్తిడి తెచ్చినందుకే భాను కిరణ్ అతడి హత్యకు పథకం రచించాడని పోలీసుల వద్ద మన్మోహన్‌సింగ్‌, సుబ్బయ్య వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. సూరి కొంతకాలంగా అసభ్య పదజాలంతో దూషించడం, కొట్టేందుకు యత్నించడంతో అవమానం భరించలేకే అతడిని చంపేద్దామంటూ భాను నిర్ణయానికి వచ్చాడని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. మద్దెలచెర్వు సూరి బినామీ పేర్లతో ఉన్న ఆస్తులతో పాటు భానుకిరణ్‌ సొంతంగా సెటిల్‌మెంట్లు చేసేవాడని సుబ్బయ్య పోలీసు అధికారులకు చెప్పాడు. ఐదారేళ్లుగా మాత్రమే భానుతో పరిచయం ఉందని, అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవాడినన్నారు. సూరిని చంపేయాలనుకున్నట్టు భాను తనకు కొద్దిగంటల ముందు మాత్రమే చెప్పాడని, తాను భయం వ్యక్తం చేస్తే అలాంటిదేం లేదంటూ ఒప్పించాడని మన్మోహన్‌సింగ్‌ చెప్పినట్టు సమాచారం.

మాదాపూర్‌ నుంచి బంజారాహిల్స్‌ వెళ్లేలోపు జనసంచారం లేని ప్రాంతంలో ఎక్కడో ఒక్క చోట పథకాన్ని అమలు చేస్తానని, కారుతో కూకట్‌పల్లిలో ఫలానాచోట ఉండాలంటూ భాను చెప్పాడని మన్మోహన్‌సింగ్‌ వివరించాడు. సూరి హత్యజరిగిన రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి భాను, సుబ్బయ్యల మధ్య ఫోన్‌ సంభాషణలు లేవని, సంక్షిప్త సందేశాల ద్వారానే వీరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని, ఫోన్‌లో మాట్లాడితే సూరికి అనుమానం వస్తుందన్న భావనతో భాను ఈ జాగ్రత్త తీసుకున్నాడుని అంటున్నారు. మాదాపూర్‌లో అలేఖ్య అపార్ట్‌మెంట్‌ నుంచి కారులో బయలుదేరిన కొద్ది నిముషాలకే తాను ఎక్కడున్నది, ఎలా ఉన్నది ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సుబ్బయ్యకు తెలిపాడు.

తెలిసిన వివరాల ప్రకారం - పథకాన్ని ఎక్కడైతే అమలు చేస్తే బావుటుందని సంక్షిప్త సందేశాల ద్వారా మాట్లాడుకున్నారు. కారును వెంబడిస్తున్న సుబ్బయ్య, హరిలు కొంచెం ముందుకు వెళ్లి బంజారాహిల్స్‌లో సూరిని చంపితే అనుమానం రాదంటూ సంక్షిప్త సందేశాన్ని పంపారు. దాన్ని పరిశీలించిన తర్వాత భాను సూరిని పదిహేను నిముషాల్లో కాల్చిచంపాడు. బయటకు వచ్చిన తర్వాత మన్మోహన్‌సింగ్‌ను కలవగా కారు లేదని చెప్పడంతో లోక్‌నాథ్‌కు ఫోన్‌ చేసి కారు తెమ్మన్నారు. కూకట్‌పల్లి నుంచి కారులో షోలాపూర్‌ వరకూ వెళ్లామని మన్మోహన్‌సింగ్‌, సుబ్బయ్యలు పోలీసుల వద్ద అంగీకరించారు. షోలాపూర్‌ వెళ్లిన తర్వాత భాను తమను వెళ్లిపొమ్మన్నాడని, భయంతో అతడి వెంటే ఉండిపోయామని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X