రూ. 2 వేల కోట్ల బొమ్మ.. "ధురంధర్ - ది రివెంజ్" రివ్యూ.. ఇది సార్ సినిమా అంటే !!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన మూవీ "ధురంధర్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం ఏకంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్ ' - ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
( Dhurandhar the revenge ) మొదటి పార్టులో ఏం జరిగిందంటే..?
భారత్‌పై ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్థాన్ చేస్తున్న మారణహోమాన్ని అంతం చేయాలంటే ఆపరేషన్ ధురంధర్ చేపట్టాల్సిందేనని భారత ఇంటెలిజెన్స్ బ్యూరీ చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తారు. ఈ ఆపరేషన్‌కి ఓ కుర్రాడ్ని భారత ఏజెంట్ ని హమ్జా (రణ్‌వీర్ సింగ్) మారుపేరుతో పాకిస్థాన్‌కి పంపిస్తారు. అక్కడికి ఒక సామ్యానుడిగా అడుగుపెట్టి పాకిస్థాన్‌లో ఓ స్థాయికి ఎలా ఎదిగాడు..? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడనేది ధురంధర్ మొదటి పార్ట్ కథ. రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ఈ పార్ట్‌ని ముగించారు.

కాగా ఇప్పడు సెకండ్ పార్టులో మొదటి పార్ట్‌ని మించిన యాక్షన్ సీన్లు, కథ, కథనం, రక్తపాతం అన్నీ ఇందులో ఉంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. అంతే కాకుండా ఈసారి హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో దక్షిణాది భాషలన్నింటిలోనూ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రీమియర్ షో బుకింగ్స్‌కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగుతో పాటు తమిళ ప్రీమియర్ షోలు రద్దు కావడం ఆడియన్స్‌ని నిరాశపరిచింది. మరి ధురంధర్ 2 (Dhurandhar the revenge) ఆడియన్స్‌కి ఏ రేంజ్ కిక్కు ఇచ్చిందో తెలుసుకుందాం..
పార్ట్ 2 కథ :
'ధురంధర్ ది రివెంజ్' స్టోరీని మొత్తం ఆరు ఛాప్టర్లుగా చూపించారు. మొదటి పార్ట్‌లో అసలు పాకిస్థాన్‌కి వెళ్లిన భారత ఏజెంట్ హమ్జా (రణ్‌వీర్ సింగ్) అసలు కథేంటి? హమ్జాగా పేరు మార్చక ముందు జస్కిరాత్ సింగ్ రాంగి జీవితంలో ఏం జరిగింది? ఏ పరిస్థితుల్లో అతను జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలు చూపించాడు. అలానే పాకిస్తాన్లో రహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) చనిపోయిన తర్వాత ఏం జరిగింది ?? ఆ తర్వాత జస్కిరాత్‌ని హమ్జాగా పేరు మార్చి పాకిస్థాన్‌కి పంపడం.. హమ్జా రాజకీయాల్లో ఎలా ఎదిగాడు ?? పాక్ రాజకీయాలను తన గుప్పిట్లోకి తీసుకుని, 26/11 ముంబై దాడులకు హంజా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..?
ఇక బడే సాహెబ్ అంటూ మొదటి పార్టులో ఫుల్ హైప్ ఇచ్చిన వ్యక్తిని హమ్జా కలవడంతో కథలో అసలు మజా వస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ లో ఒక బలమైన శక్తిగా ఎలా ఎదిగాడు..? పోలీస్ ఆఫీసర్ ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్), ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్), మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) పాత్రలు హంజా మిషన్‌ను ఎలా మలుపు తిప్పాయి ?? హమ్జా భారత ఏజెంట్ అని ఎవరైనా తెలుసుకున్నారా? మొత్తానికి ధురంధర్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది ధురంధర్ 2లో అసలు కథ.
మూవీ ఎలా ఉందంటే..?
ధురంధర్ 2 సినిమా రన్‌టైమ్ సరిగ్గా 3 గంటల 49 నిమిషాలు. దాదాపు 4 గంటలు ఉన్న ఈ మూవీ అంత సేపు ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టడంలో డైరెక్టర్ ఆదిత్య ధార్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. పంజాబ్‌లోని ఓ సాధారణ ఆర్మీ జవాన్ కొడుకైన జస్కిరాత్.. హమ్జాగా మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అనే విషయాన్ని చాలా బలంగా చూపించాడు. ఇక దేశభక్తితో జవాన్ అవుదామనుకున్న కుర్రాడ్ని అదే దేశంలోని రాజకీయం ఒక హంతకుడ్ని చేసిన తీరు ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇక రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత ల్యారీలో చెలరేగిన అల్లర్లు.. అతని సోదరుడు ఉజెయిర్ బలోచ్‌ని చాలా తెలివిగా హమ్జా ట్యాకిల్ చేసిన తీరు.. ఇవన్నీ మెప్పిస్తాయి. ఇక పాకిస్థాన్ రాజకీయాల్లో హమ్జా ఎదిగిగిన తీరు.. దాని కోసం వేసిన ఎత్తులు కూడా ఆడియన్స్‌కి కిక్కిస్తాయి. ముఖ్యంగా భారత్ కు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన పలు ముఖ్యమైన ఘటనలను కూడా ప్రస్తావించారు. నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలని స్టోరీకి లింక్ చేయడంలో కూడా ఆదిత్య టాలెంట్ నిరూపించుకున్నాడు. అలానే ఎప్పుడైతే హమ్జా భారత ఏజెంట్ అని తెలుస్తుందో అప్పటి నుంచి కథలో అసలు మజా మొదలవుతుంది.
సెకండాఫ్‌లో కూడా మొత్తం పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులు, భారత్‌కి వ్యతిరేకంగా పనిచేసే పలువుర్ని ఏరిపారేసే సీన్లు ఇవన్నీ కూడా విజిల్స్ వేయిస్తాయి. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి.. ముఖ్యంగా పంజాబ్, యూపీ రాష్ట్రాల్లోకి డ్రగ్స్, టెర్రరిజం సప్లై చైన్ ఎలా నడుస్తుందనే కఠోర వాస్తవాలను ఈ సినిమా ధైర్యంగా ఎక్స్‌పోజ్ చేసింది. ఇక మొదటి పార్ట్‌లో బాగా హైప్ ఇచ్చిన బడే సాహెబ్ ఎవరనేది థియేటర్లో చూస్తేనే ఆడియన్స్‌కి ఆ కిక్కు వస్తుంది. అలానే హమ్జాని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎలీనా (సారా అర్జున్)కి కూడా ఇందులో రెండు మూడు బలమైన సీన్లు పడ్డాయి. ఇక క్లైమాక్స్‌లో ఒక పాత్రలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఆడియన్స్‌కి మంచి మజాని ఇస్తుంది. ఓవరాల్‌గా ఇదొక సాలిడ్ "దేశభక్తి ఉన్న రివెంజ్ డ్రామా".
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో రణ్‌వీర్ యాక్టింగ్ ఏ రేంజులో ఉంటుందో అక్షయ్ ఖన్నాకి కూడా అదే రేంజులో ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ ధురంధర్ 2లో మాత్రం సినిమా మొదలైనప్పటి నుంచి చివరి నిమిషం వరకూ అసలు ఆ పాత్రకి రణ్‌వీర్ తప్ప వేరెవరూ న్యాయం చేయలేరేమో అన్నట్లుగా ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్ సీక్వెన్సుల్లో ఎంత క్రూరంగా కనిపించాడో ఎమోషనల్ సీన్లలో అంతలా కంటతడి కూడా పెట్టించాడు.
ఇక అజయ్ సన్యాల్‌గా మాధవన్ నటన కూడా చాలా బావుంది. చాలా కూల్‌గా కనిపిస్తూ దేశం కోసం ఎత్తులు వేసే ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్రలో మాధవన్ నటన శభాష్ అనిపిస్తుంది.
సంజయ్ దత్ మరోసారి తన నటనతో అదరగొట్టారు.
అర్జున్ రాంపాల్ పాత్ర కూడా చాలా దీటుగా కనిపిస్తుంది.
ఇక సారా అర్జున్ పాత్రకి స్కోప్ తక్కువే అయినా కూడా ఉన్న సీన్లలో మెప్పించింది.
ఇక మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు కూడా అందరూ మంచిగా యాక్ట్ చేశారు.
టెక్నికల్ అంశాలు..
ఇక సినిమాలో వయెలెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా మొత్తం చాలా సీన్లు రక్తపాతంతోనే ఉంటాయి. అయితే A సర్టిఫికేట్ సినిమా కాబట్టి ఆ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసే వస్తారు ఆడియన్స్. కానీ వాళ్ల అంచనాలకి మించే వయలెన్స్ సీన్లు ఉన్నాయి.
మ్యూజిక్ కూడా సినిమాలో యాక్షన్ సీక్వెన్సులని మరో స్థాయికి తీసుకెళ్లింది.
నెగిటివ్..
కొన్ని సీన్స్ లాగ్ చేసినట్టు అనిపించవచ్చు
సినిమా నిడివి
రేటింగ్ - 3.5 / 5
-
సమంత "వావ్" వీడియో వైరల్..! -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications