IPL 2026: ఈసారి ఐపీఎల్ టైటిల్ వాళ్లదే-ఏబీ డివిలియర్స్ సంచలన జోస్యం..!
మరో 9 రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ (IPL 2026) ప్రారంభం కాబోతోంది. టైటిల్ కోసం అన్ని జట్లూ హోరాహోరీ పోరాడేందుకు అస్త్రశస్త్రాల్ని సిద్దం చేసుకుంటున్నాయి. భారత్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఐపీఎల్ తొలి 20 మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రమే బీసీసీఐ ఇప్పటివరకూ ప్రకటించింది. ఇవి ముగిసేలోపు మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ రానుంది. అయితే టోర్నీ మొదలుకాక ముందే ఈసారి ఐపీఎల్ విజేత ఎవరో సౌతాఫ్రికా గ్రేట్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers)చెప్పేశాడు.
ఈసారి ఐపీఎల్ లో ఏబీ డివిలియర్స్ గతంలో ఆడిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు (royal challengers bengaluru) డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. ఆ జట్టుకు చెన్నై, ముంబైతో పాటు మరికొన్ని జట్ల నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. టైటిల్ కాపాడుకోవాలంటే రాయల్ ఛాలెంజర్స్ తీవ్రంగా శ్రమించాల్సిందే. ఈ నేపథ్యంలో మరోసారి టైటిల్ గెల్చే సత్తా ఆర్సీబీకే ఉందని డివిలియర్స్ జోస్యం చెప్పాడు. అలాగే ఆర్సీబీ (RCB)జట్టు టైటిల్ గెల్చుకుంటుందని ఎందుకు తాను నమ్ముతున్నాడో కూడా ఏబీ వెల్లడించాడు.

ఈసారి ఆర్సీబీ జట్టులో టైటిల్ గెల్చుకోవాలనే లక్ష్యంతో ప్లేయర్లు అంతా ముందుకు సాగుతున్నారని, కాబట్టి విరాట్ కొహ్లీపైనే భారం అంతా పడదని కూడా ఏబీ డివిలియర్స్ తేల్చేశాడు. అలాగే ఈసారి ఆర్సీబీ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని కూడా ఏబీ అంచనా వేస్తున్నాడు. కాబట్టి మరోసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందన్నాడు. అదే సమయంలో ఒకసారి టైటిల్ గెలిస్తతే ఆర్సీబీ ఇక వరుసగా రెండు, మూడు, నాలుగు.. ఇలా వరుసగా టైటిల్లు గెలుస్తుందన్న కొహ్లీ గత వ్యాఖ్యల్ని డివిలియర్స్ గుర్తుచేశాడు. ఆ వ్యాఖ్యలే నిజమని, ఆర్సీబీ ఇప్పుడు వరుసగా రెండు, మూడు కప్పులు గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఏబీ వెల్లడించాడు.












Click it and Unblock the Notifications