కాంగ్రెసుతో చిరంజీవిది అక్రమ సంసారం: సిపిఐ నేత కె. నారాయణ

కాంగ్రెసు నుంచి బయటకు వచ్చినప్పుడు వైయస్ జగన్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారని, అలాగే ప్రజారాజ్యం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి కాంగ్రెసులో పార్టీని విలీనం చేయాలని, లేకుంటే అది అక్రమ సంసారమే అవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని గట్టున పడేయడం చిరంజీవి తరం కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ద్వారా సామాజిక న్యాయం సాధిస్తామని చిరంజీవి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు అనుసరించిన విధానాల వల్లనే ఈ స్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా కాంగ్రెసుకు మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications