చిరంజీవి పంచె జనాలు ఊడదీయాలా?: బిజెపి ఆధ్యక్షుడు కిషన్‌రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
గత
సాధారణ
ఎన్నికల్లో
కాంగ్రెస్
పార్టీకి
వ్యతిరేకంగా
పోటీ
చేసి
18
సీట్లు
గెలుచుకున్న
ప్రజారాజ్యం
పార్టీ
అధ్యక్షుడు
చిరంజీవి
ఇప్పుడు
ప్రజలకు
ఏం
సమాధానం
చెబుతారని
భారతీయ
జనతా
పార్టీ
రాష్ట్ర
అధ్యక్షుడు,
అంబర్‌పేట
శాసనసభ్యుడు
గంగారపు
కిషన్‌రెడ్డి
ప్రశ్నించారు.
ఎన్నికలకు
ముందు
కాంగ్రెస్‌పై
పీఆర్పీ
నిప్పులు
చెరిగి
ఇప్పుడు
వారి
పంచన
చేరడం
ఏమిటని
ప్రశ్నించారు.
ఆప్పుడు
కాంగ్రెస్
నేతల
పంచెలూడదీసి
కొట్టాలన్న
చిరంజీవి
పంచెను
ఇప్పుడు
జనాలు
ఊడదీయాలా
అని
ప్రశ్నించారు.
ప్రభుత్వం
చదువుకునే
విద్యార్థులకు
ఫీజు
రీయింబర్సుమెంటును
కూడా
చెల్లించడం
లేదని
ధ్వజమెత్తారు.
విద్యార్థులకు
వెంటనే
ఫీజు
రీయింబర్సుమెంటు
చెల్లించాలని
డిమాండ్
చేశారు.
ప్రభుత్వం
వెంటనే
ఫీజులు
చెల్లించాలని
భారతీయ
జనతా
పార్టీ
ఆధ్వర్యంలో
మంగళవారం
ధర్నా
చౌక్
వద్ద
ఒక్కరోజు
నిరాహార
దీక్ష
చేస్తున్నట్టు
చెప్పారు.