సోనియాపై విరుచుకుపడిన జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసుకోవడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు నేతల పంచెలూడదీస్తామన్న వారిని పార్టీలో ఎందుకు చేర్చుకుంటారన్నారు. సొంత కూతురు ప్రేమను ఒప్పుకోని చిరంజీవి సామాజిక న్యాయం ఎలా చేస్తాడని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామికి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించడం ఎంత వరకు సమంజసం అన్నారు. కాకా సోనియాపై చేసిన ఆరోపణలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతిపరుడే అయితే రెండోసారి ముఖ్యమంత్రిగా ఎందుకు కూర్చుండబెట్టారని ప్రశ్నించారు.
పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రిగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై అంతగా నమ్మకం ఉంటే శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె సవాల్ చేశారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి క్రమశిక్షణ పేరుతో షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు.












Click it and Unblock the Notifications