భార్య మంత్రి పదవి కాపాడుకునేందుకు విమర్శలు: వర్ల రామయ్య

Varla Ramaiah
హైదరాబాద్: భార్య మంత్రి పదవి కాపాడుకోవడానికే కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని విమర్శిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య బుధవారం ఆరోపించారు. రాజ్యసభ సీటుకోసం చంద్రబాబు ఒకరినుండి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తున్న దగ్గుపాటి తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడు కావడానికి ఎంత ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి రాకపోవటంతోనే దగ్గుపాటి కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు.

ఆయన నియోజకవర్గంలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని దగ్గుపాటి జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ అవినీతిలో చంద్రబాబు పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఆయన ఖండించారు. ఎమ్మార్‌పై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన మార్పులు తెలియవా అని ప్రశ్నించారు. తెలియకుంటే మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వద్దకు వెళ్లి తెలుసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+