వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి?

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇప్పటికే శివకుమార్ అనే వ్యక్తి పేరుట రిజిస్టర్ అయి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. రెండురోజుల క్రితం జగన్ శివకుమార్‌తో భేటీ అయ్యారు. పార్టీ తాను తీసుకునే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. శివకుమార్ పేరిట రిజిస్టర్ అయి ఉన్న ఈ పార్టీకి అధ్యక్షుడు కూడా శివకుమారే. మొదట ఆ పార్టీలో జగన్ సభ్యత్వం తీసుకొని, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనే జగన్ ఈ పార్టీ పేరుతో హడావుడి చేసినప్పటికి జగన్ వర్గం దానిని కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications