హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరుగురు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల రాజీనామా యోచన?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెసు పార్టీకి చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామాకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. విపక్షాలతో పాటు తెలంగాణకు చెందిన అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు కూడా గత కొంతకాలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరు గత డిసెంబర్‌లో విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలంటూ రెండురోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు. వారు అప్పడే ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు.

అయితే ఇప్పుడు తాజాగా ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడుతుందా లేదా అని వెయిట్ చేసే ధోరణిలో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు కోసం వారు ముందు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల కేసుల ఎత్తివేత సమయంలో కేంద్రం జోక్యం చేసుకుందని ఇప్పుడు అలాగే మా రాజీనామాల ఒత్తిడితో జోక్యం చేసుకొని తెలంగాణకు ఆమోదం తెలుపవచ్చునని వారు భావిస్తున్నారు.

English summary
At least six congress MPs from the Telangana region are planning to resign from Lok Sabha, if the UPA government fails to introduce a bill in support of a separate state during the budget session of Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X