హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ హామీ నెరవేర్చండి: సోనియాకు శంకర్‌రావు లేఖ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: శాసనసభలో గురువారం జరిగిన దాడిపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్‌రావు మూడు పేజీల లేఖ రాసి పంపిస్తానని చెప్పారు. ఈ లేఖలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్రమంత్రి చిదంబరానికి పంపిస్తానని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుకోవడం, మీడియా పాయింట్ వద్ద లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణను టిఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని తదితర అంశాలను విపులంగా వివరిస్తూ లేఖ రాశారు. టిఆర్ఎస్ ఇలాంటి దాడులు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి అన్నారు.

ఇది చరిత్రలో బ్లాక్ డేగా నిలిచి పోతుందన్నారు. ఆ లేఖలో తెలంగాణ అంశాన్ని కూడా శంకర్‌రావు ప్రస్తావించారు. గత డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని కోరారు. అది నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని దానిని నెరవేర్చాలని శంకర్‌రావు కోరారు.

English summary
Minister Shankar Rao wrote a letter to AICC president Sonia Gandhi today developments took place in Assembly. He 
 
 urged Sonia to commit Home Minister Chidambaram's December 9th statement on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X