హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డితో కొండా సురేఖ భేటీ ఆంతర్యం ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలోని ఆంతర్యమేమిటనేది అర్థం కావడం లేదు. వైయస్ జగన్‌కు దూరమై కాంగ్రెసుకు దగ్గర కావాలని సురేఖ ప్రయత్నిస్తున్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో సురేఖ ముఖ్యమంత్రితో భేటీ కావడం విశేషమని అంటున్నారు.

వైయస్ జగన్ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం చేస్తున్న దీక్షకు ఆమె సోమవారం హాజరయ్యారు. కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే, సురేఖ మాటల్లో గతంలోని వేడి, వాడి కనిపించడం లేదని అంటున్నారు. కాంగ్రెసుపై ఆమె స్థాయి తగ్గించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Congress MLA Konda Surekha, who supporting YS Jagan met chief minister Kiran kumar Reddy today. There is a rumor that She may distance from YS Jagan and express loyalty to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X