హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ దీక్ష విరమించాలి: మంత్రి పితాని సత్యనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pitani Satyanarayana
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ చెల్లించాలంటూ ధర్నాచౌక్ వద్ద చేస్తున్న దీక్షను వెంటనే విరమించాలని మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ జగన్ దీక్ష చేయడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజులు చెల్లిస్తామని చెప్పారు.

పేద విద్యార్థులకు ఏవిధమైన సమస్యా లేకుండా చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌లో 50 శాతాన్ని ప్రభుత్వం చెల్లించకుంటే ఈ నెల 24వ తారీఖునుండి కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించిన ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల తీరును ఆయన తప్పుబట్టారు. యాజమాన్యాలకు కళాశాలలు మూసివేసే అధికారం లేదని చెప్పారు.

English summary
Minister Pitani Satyanarayana urged today Ex MP YS Jaganmohan Reddy to withdraw deeksha. He promised to release Fee Reimbursements soon. He accused engineering colleges management for warning closure of colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X