కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై అలిగిన వరదరాజులు రెడ్డి, కాంగ్రెసు వైపు చూపు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప‌: స్థానిక మండలి ఎన్నికలు జగన్ శిబిరంలో అసమ్మతి సెగ ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి తనకు అనుకూలంగా నాయకులను మలుచుకోవడం చాలా వరకు విజయం సాధించిన జగన్ తర్వాతి పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. కడప జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని జగన్ తన వైపు తిప్పుకున్నా ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. స్థానిక మండలి ఎన్నికల్లో నిలబడేందుకు ఆసక్తితో ఉన్న వరదరాజులరెడ్డికి జగన్ శిబిరం ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం, పైగా ప్రొద్దుటూరులో తనకు విరోధిగా ఉంటున్న రాచమల్లును జగన్ శిబిరంలో చేర్చుకోవడం, ఆయన ఇంటికి వెళ్లి సమావేశాలు నిర్వహించడం లాంటి పరిణామాలు వరదరాజులరెడ్డిని తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది.

ఒకటి, రెండు రోజులు జరిగిన పరిణామాల్లో దేవగుడి నారాయణరెడ్డికే మండలి అభ్యర్థిత్వం దక్కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వరదరాజులరెడ్డి లో మరింత అసంతృప్తి చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వరదరాజులు రెడ్డిని తిరిగి కాంగ్రెసులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి మంగళవారం పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వరదరాజులరెడ్డి వద్దకు వీరశివారెడ్డి వెళ్లి చర్చించినట్లు తెలుస్తోంది. వీరశివారెడ్డితో పాటు మంత్రి వివేకానందరెడ్డి కూడా వరదరాజులరెడ్డితో మాట్లాడినట్లు తెలియవస్తోంది. ఈ సందర్భంగా గోవిందరెడ్డితో కూడా వీరిద్దరూ మాట్లాడినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే కాంగ్రెసులోకి తిరిగి రావడంపై ఆయన ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోయినా జగన్ వర్గంలో కొనసాగే విషయంపై పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.

English summary
It is said that Varadarajulu Reddy is unhappy with his leader YS Jagan. He is aspiring MLC ticket from YS Jagan. But Devagudi Narayana Reddy has chances to contest from YS Jagan camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X