వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజంగానే మావోల చెర నుంచి వినీల్ కృష్ణ విడుదలయ్యారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vineel Krishna
భువనేశ్వర్: నిజంగానే ఈసారి మావోయిస్టులకు బందీగా చిక్కిన ఒరిస్సాలోని మల్కన్‌గిరి కలెక్టర్ వినీల్‌కృష్ణ విడుదలయ్యారు. దీంతో తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెర పడింది. క్షేమంగా ఇంటికి చేరారు. మల్కనగిరి జిల్లా జనతాబాయ్‌ అటవీ ప్రాంతంలో విలేకరుల సమక్షంలో కలెక్టర్‌ను మావోయిస్టులు స్థానికులకు అప్పగించారు. వినీల్ కృష్ణ విడుదలకు మావోయిస్టులు తాజాగా నాలుగు డిమాండ్లు పెట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అంతకుముందు ఒప్పుకున్నట్లుగా మరో 24 గంటల్లో కలెక్టర్‌ను విడిచి పెట్టాలని మధ్యవర్తి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ చేసిన విజ్ఞప్తికి వారు స్పందించినట్లు కనిపిస్తోంది. మధ్యవర్తులు హరగోపాల్‌, దొండపాణి మహంతిలు ప్రత్యేక హెలికాప్టర్‌లో గురువారం కొరాపుట్‌ చేరుకుని అధికారులతో చర్చలు జరిపిన క్రమంలో కలెక్టరు వినీల్‌కృష్ణ నక్సల్స్‌ చెర నుంచి విడుదలయ్యారన్న వార్త వెలువడింది.

మావోయిస్టులు గురువారం మధ్యాహ్నం కుడుములగుమ్మ బ్లాక్‌ పరిధిలోని బొడపాడు, సప్పర్లమెట్ట, రాళ్లగెడ్డ మూడు పంచాయతీలకు చెందిన సుమారు వేయి మంది ఆదివాసీ గిరిజనుల సమక్షంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సుమారు 40 మంది మావోయిస్టులు హాజరయ్యారు. విప్లవ గీతాలతో ప్రారంభమై, అనంతరం బహిరంగసభ జరిగింది. ఈ ప్రాంతంలో అణగారుతున్న ఆదివాసీల బతుకులను సరిదిద్దడానికి అంతా ప్రయత్నించాలని మావోయిస్టు నాయకులు సూచించారు. మల్కనగిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌కృష్ణ మాట్లాడుతూ మావోయిస్టుల చెరలో ఉన్న తొమ్మిది రోజులలో తనను చాలా అభిమానంగా చూసుకున్నారన్నారు. వసతి, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. తన విడుదలకు ఆదివాసీలు చేసిన కృషి మరువలేనిదన్నారు. ''ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా, పేద ప్రజల అభ్యున్నతికి, వారి అభివృద్ధికి పాటుపడతాను, ఇదే నా సంకల్పం'' అని వినీల్‌ ప్రకటించారు. అనంతరం మావోయిస్టులు ఆ ప్రాంత గిరిజనులకు కలెక్టర్‌ను అప్పగించారు.

వారు అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై జనతాబాయి గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి మర పడవలో జనతాబాయి ఘాట్‌కు తీసుకువెళ్లి తొమ్మిది రోజులుగా కలెక్టర్‌ కోసం ఎదురు చూస్తున్న డ్రైవరు శంకరరావు, అధికారులకు కలెక్టర్‌ను అప్పగించారు. ఇంటివద్ద విలేకరులతో మాట్లాడిన వినీల్‌కృష్ణ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

English summary
After remaining in captivity for nine days, Malkangiri Collector RV Krishna was released on Thursday by Maoists, an official said, finally bringing to an end the tense hostage crisis in Orissa. The 30-year-old IIT graduate-turned IAS officer was released before a "people's court" by his abductors in a forested area in Jantapai close to the area where he was abducted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X