తెలంగాణ ఉద్యమానికి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి

60వ దశకంలో గుంటూరు జరిగిన సన్మాన సభలో కూడ నేను తెలంగాణ బిడ్డనని సగర్వంగా చెప్పుకున్నానని తెలిపారు. 1953లోనే కాళోజీ, దాశరథిలతోపాటు తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి తెలంగాణలో తెలుగుభాషా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషిచేసినట్లు వెల్లడించారు. తెలంగాణ కవులు, రచయితలు ఏర్పాటు చేసే సాహిత్య సభల్లో తప్పకుండా పాల్గొంటానని సినారె స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన తెలంగాణ కవుల గర్జన సమావేశంలో తెలంగాణకు మద్దతు ప్రకటించాలని సినారెపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కవులు అనుకున్నారు. అవసరమైతే సినారె ఇంటిని ముట్టడించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సినారె ఈ ప్రకటన విడుదల చేశారు.