కడప కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ వివేకానా, వరదరాజులు రెడ్డియా?

జగన్ ఎఫెక్ట్ దృష్ట్యా ఆయనను అడ్డుకునేందుకు మొదట వ్యవసాయ శాఖామంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కూడా అనుకున్నారు. అయితే పులివెందుల ఉప ఎన్నికలలో జగన్ ఎదుర్కోవడానికి కూడా వివేకా అవసరం. ఈ దృష్ట్యా అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. కాగా కడప జిల్లాను మినహాయించి మిగిలిన ఏడుగురు పేర్లను ప్రకటించింది. అనంతపురం నుండి వేణుగోపాల్ రెడ్డి, కర్నూల్ నుండి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు నుండి వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమ గోదావరి నుండి గంగాభవాని, శ్రీకాకుళం నుండి విశ్వరూప్, చిత్తూరు నుండి నరేష్ కుమార్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుండి గిడుగు రుద్రరాజులను అభ్యర్థులుగా రంగంలోకి దింపినట్టుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications