చంద్రబాబుకు షాక్: టిడిపికి యడ్ల రమణమూర్తి రాజీనామా
State
oi-Srinivas G
By Srinivas
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజయనగరం జిల్లా నాయకులు పెద్ద షాక్‌ను ఇచ్చారు. విజయనగరం జిల్లా జెడ్పీటీసి రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి యడ్ల రమణమూర్తి గురువారం టిడిపికి, తన జెడ్పీటీసి పదవికి రాజీనామా చేశారు. జెడ్పీటీసీ రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ వీరబ్రయ్యకు అంద జేసినట్టుగా తెలుస్తోంది. రమణమూర్తి మాజీ మంత్రి, జిల్లాకు చెందిన శాసనసభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజు వైఖరి వల్లనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రమణమూర్తితో పాటు మరికొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా టిడిపిని వీడినట్టుగా తెలుస్తోంది.
ఆయనతో పాటు నలుగురు ఎంపీటీసి సభ్యులు, ఆరుగురు సర్పంచ్‌లు తెలుగుదేశం పార్టీకి, అనుబంధ సంస్థలకు రాజీనామా చేశారు. రమణమూర్తి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరి నిర్ణయాన్ని ప్రకటించారు.
Vijayanagaram district TDP senior leader and ZPTC gave shocked to TDP president Chandrababu Naidu. He was resigned to TDP yesterday. He gave his resignation letter to district collector Veera Brahmaiah.