హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి ఆ తర్వాత చిన్న రాష్ట్రాలు: తెలంగాణకు బాబా రామ్ దేవ్ మద్దతు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల విభజన సరియైనదేనని ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ శుక్రవారం విశాఖపట్టణంలో చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలుగా విభజించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలా ఉండటం మంచిదేనని చెప్పారు. అయితే చిన్న రాష్ట్రాల కంటే ముందు దేశంలో పేరుకు పోయిన అవినీతిపై దృష్టి సారించాల్సిన అవసరం అంతకంటే ముందు ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.

దేశ రాజకీయాలు పూర్తిగా కలుషితం అయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని పార్లమెంటుకు పంపిస్తే వారు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. కలుషితమైన రాజకీయాలను సంస్కరించేందుకు జూన్‌లో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ రాజకీయ పార్టీ దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుందని చెప్పారు.

English summary
Yoga guru Baba Ramdev said today that smaller states were to facilitate administration. He said must try to end corruption in india, before smaller state issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X