హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమస్య చాలా భయంకరంగా ఉంది: టిడిపి అధినేత చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: చేనేత పరిస్థితి రాష్ట్రంలో చాలా సమస్యగా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్న చేనేత సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ప్రజలు ఆధారపడే రంగం చేనేత అని, కానీ ప్రభుత్వం మాత్రం దానిని నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగంపై ప్రభుత్వం చర్యలపై చంద్రబాబు పెదవి విరిచారు.

కాగా చేనేత శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి శంకర్‌రావు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రంలోనే అత్యంత మంచి ప్యాకేజీ ఉందని చెప్పారు. అప్కో బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. బోగస్ సొసైటీలను రద్దు చేస్తామని చెప్పారు. సొసైటీ పెద్దలకు కాకుండా సభ్యులకు నేరుగా రాయితీలు అందేలా చూస్తామని చెప్పారు. ప్రతిపక్షం ప్రజల కోసం ప్రభుత్వానికి సలహాలు ఇస్తే తీసుకునేందుకు మేం సిద్ధమని చెప్పారు.

English summary
TDP president Chandrababu naidu felt very sad today on textile development in assembly. He suggested government to solve textile industry problem soon. Minister Shankar Rao answered to Chandrbabu questiones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X