వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జపాన్ సునామీ ప్రభావం, న్యూక్లియర్ ప్లాంట్‌లో తాజా పేలుడు

భూకంపం, సునామీలతో అతలాకుతలమైన జపాన్‌కు అణు ముప్పు పొంచి ఉందని అణు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుకుషిమా నగరంలోని అణువిద్యుత్కేంద్రంలో మరో రియాక్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. మూడో రియాక్టర్ పేలుడు చోటు చేసుకోవడం దీనికి సంకేతంగా చెపుతున్నారు. ఈ ప్లాంటులో మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేంద్రంలో గత శనివారం మొదటి రియాక్టర్ పేలగా, ఆదివారం రెండో రియాక్టర్‌లో పేలుడు చోటు చేసుకుంది.
కాగా, జపాన్ రాజధాని టోక్యోలో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది. భూకంపం వల్ల భవనాలు స్వల్పంగా కంపించాయి. అయితే అధికారులు మాత్రం సునామీ ప్రమాదం లేదని వెల్లడించారు.