హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు ట్యాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం చిక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌కు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం వ్యవహారం చిక్కులు తెచ్చి పెట్టింది. విగ్రహాల విధ్వంసంపై ఆయన నోరెత్తకపోవడమే ఆ చిక్కులకు కారణం. మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలను తెలంగాణవాదులు ధ్వంసం చేయడాన్ని అన్ని పార్టీల నాయకులు ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా విగ్రహాల విధ్వంసాన్ని వ్యతిరేకించారు. కానీ, జగన్ మాత్రం నోరు మెదపలేదు. దీంతో జగన్‌పై విమర్శలు వస్తున్నాయి.

విగ్రహాల విధ్వంసాన్ని జగన్ ఎందుకు ఖండించడం లేదని కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే జగన్ మౌనం వహించారని వారన్నారు. దీనిపై జగన్‌కు మద్దతిస్తున్న కాంగ్రెసు నాయకుడు గొనె ప్రకాశ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికార కాంగ్రెసు పార్టీయే ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. జగన్‌ను అణచేయడానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

English summary
YSR Congress party leader YS Jagan is facing criticism on Tank bund statues issues. Congress party leaders are blaming YS Jagan for not condemning the distruction of statues on Tank bund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X