హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం పాపాలు మాకు చుట్టుకునేలా ఉన్నాయి: నన్నపనేని రాజకుమారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పాపాలు మాకు చుట్టుకునేలా ఉన్నాయని టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. పిఏసి చైర్మన్‌గా ఆయన ఉన్నప్పటికీ లాభం లేకుండా పోయిందన్నారు. గతంలో చాలాసార్లు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శిద్దామని చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు. ఆయన చర్యల వల్ల మాకు నష్టం జరుగుతుందన్నారు.

పిఏసి చైర్మన్‌గా నాగం జనార్ధన్ రెడ్డి నిర్వహించనున్న ప్రజాపద్దుల సంఘం సమావేశానికి తాము వెళ్లడం లేదని నెల్లూరు శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి చెప్పారు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. పిఏసి చైర్మన్‌గా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నాగం పదవి ముగిసినట్టేనని చెప్పారు. మేం అందులో సభ్యులం కాదని చెప్పారు. నాగం తన నివాసంలో కాంట్రాక్టర్లతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు.

English summary
TDP senior leader Nannapaneni Rajakumari fired at Nagam Janardhan Reddy. She blamed Nagam for projects issue. MLA Anam Vivekananda Reddy also said they will boycott PAC meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X