డిఎంకె దారిలో జయలలిత: గెలిస్తే విద్యార్థులకు ఫ్రీలాప్‌టాప్స్
National
oi-Srinivas G
By Srinivas
|
చెన్నై: తమిళనాడులో విజయం కోసం అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత కూడా డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి కరుణానిధి రూట్లో వెళుతున్నారు. ఎన్నికలలో గెలిస్తే విద్యార్థులందరికీ ఫ్రీలాప్ టాప్‌లు ఇస్తామని డిఎంకే ఇప్పటికే ప్రకటించింది. ఇప్పడు జయలలిత కూడా అదే దారిలో నడుస్తోంది. అన్నాడిఎంకెను అధికారంలోకి తెస్తే విద్యార్థులకు ఫ్రీలాప్ టాప్‌లు ఇస్తామని చెప్పారు. గురువారం అన్నాడిఎంకె మానిఫెస్టోను విడుదల చేశారు. రేషన్ కార్డు ఉన్న వారికి 20 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యాన్, మిక్సీ, గ్రైండర్ ఇస్తామని చెప్పారు.
ఆమె గురువారం శ్రీరంగం నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. అమెకు మద్దతుగా భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఇక తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పార్టీలో పోటాపోటీగా ఉచిత పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజలలోకి వెళుతున్నారు. డిఎంకె అధినేత తనయ కనిమొళికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు ఓటర్లు బాగా ఆకర్షిస్తున్నాయి.
AIADMK president Jayalalitha followed DMD in her party manifesto. She promised to students free laptops. chief minister M Karunanidhi on Wednesday launched his campaign from his home turf for the Assembly elections, promising more freebies than listed in the party's manifesto.
Story first published: Thursday, March 24, 2011, 14:01 [IST]