కార్యకర్తను చితకబాదిన విజయ్‌కాంత్: కలైంజ్ఞర్ టీవి పనే అన్న హీరో

అయితే ఇందులో నిజం లేదని విజయ్‌కాంత్ అంటున్నారు. తాను ఏ కార్యకర్తను కొట్టలేదని చెబుతున్నారు. తాను కార్యకర్తను కొడుతున్న దృశ్యాలు కేవలం కల్పితమే అన్నారు. వాటిని మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కలైంజ్ఞర్ టీవీ, సన్ టీవీలు కలిసి తాను కార్యకర్తను చితకబాదినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ డామేజ్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఇమేజ్ డామేజ్ చేయ ప్రయత్నించాయంటూ ఆయా టీవీలకు విజయ్‌కాంత్ లీగల్ నోటీసులు పంపారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.