లిబియా రెబెల్స్‌పై తన సెక్సీ కూతురును పంపిన గడాఫీ

ఐషాను ఉత్తర ఆఫ్రికా క్లాడియా స్కిఫర్‌గా అభివర్ణిస్తారు. దేశం సివిల్ వార్‌తో అట్టుడుకుతుంటే ఐషా ముఖం రంగులు తీసేసి ఆ 34 ఏళ్ల మహిళ యుద్ధ భూమికి తరలింది. తన తండ్రిని బలపరిచినందుకు ఆమె ఇప్పటికే యుఎన్ గుడ్‌విల్ అంబాసిడర్ హోదాను కోల్పోయింది. తన 27 ఏళ్ల సోదరుడు మరణించాడనే వార్తల నేపథ్యంలో ఆమె యుద్ధరంగంలో కాలు పెట్టినట్లు చెబుతున్నారు.
తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి ఐషాకు పశ్చిమ దేశాలంటే విపరీతమైన ద్వేషం. తాము గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో ట్రిపోలీలో అమెరికా వైమానిక దాడుల్లో తన దత్తత సోదరి హన్నా మరణించినప్పటి నుంచి ఆమెలో ఆ ద్వేషం రగులుతూ వస్తోంది. ఐషా 2006లో అహ్మద్ ఆల్ - గడాఫీని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఐఆర్ఎను బహిరంగంగా బలపరుస్తూ వస్తోంది. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హస్సేన్ తరఫున అమెరికాకు వ్యతిరేకంగా వాదించింది కూడా.












Click it and Unblock the Notifications