పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం మళ్లీ క్షీణించిందా?

Sathya Sai Baba
అనంతపురం: పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం మళ్లీ క్షీణించిందనే వదంతులు గుప్పుమంటున్నాయి. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని శనివారం వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. పుట్టపర్తిలో డిజిపి అరవింద్ రావు ఏర్పాటు చేసిన సమావేశం నుంచి డిఐజి చారు సిన్హా అకస్మాత్తుగా వెళ్లిపోయారు. దీంతో ఆ వదంతులు మరింతగా వ్యాపించాయి.

పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అందడం వల్ల డిజిపి సమావేశం నుంచి హఠాత్తుగా చారు సిన్హా బయలుదేరి వెళ్లారని అంటున్నారు. అయితే, సత్యసాయిబాబా ఆరోగ్యం మెరుగ్గా ఉందని సత్య సాయి ట్రస్టు ప్రకటించింది. సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి వదంతులను విశ్వంసించవద్దని ట్రస్టు ప్రజలకు సూచించింది. సత్యసాయిబాబా ఆరోగ్యం బాగానే ఉందని పుట్టపర్తి సిఐ చెప్పారు. సత్య సాయిబాబా వైద్యులతో మాట్లాడుతున్నారని సిఐ అన్నారు. జానకీరామ్ కుటుంబ సభ్యులు ప్రతి రోజూ సత్య సాయిబాబాను కలుస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+