వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెదిరింపులకు భయపడను: హజారే, మూడో రోజుకు చేరిన దీక్ష

ప్రజలు తనకు ఇచ్చిన మద్దతు శక్తిని ఇచ్చిందని అన్నారు. అవినీతి నిర్మూలనకే తాను నడుం బిగించానని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఏమైనా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వారం రోజుల పాటు తనకు ఏమీ కాదని చెప్పారు. తాను కొంత నీరసంగా ఉన్నప్పటికీ దీక్షను మాత్రం ఆపే ప్రసక్తి లేదన్నారు. దీక్షను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. లోక్‌జన్‌పాల్ బిల్లుపై కేంద్రం దిగి వచ్చే వరకు దీక్షను కొనసాగిస్తానని చెప్పారు.
కాగా లోక్‌జన్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ అన్నా హజారే చేపట్టిన దీక్ష గురువారం మూడో రుజుకు చేరుకుంది. ఆయన కొంత నీరసంగా కనిపించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనతో చర్చలు జరపడానికి సిద్ధపడింది. ఇందుకు కపిల్ సిబాల్‌ను రంగంలోకి దించింది. ఆయన స్వామి అగ్నివేష్‌తో చర్చించనున్నారు.