కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: పులివెందులలో టిడిపి రెబెల్‌గా రామ్‌ గోపాల్ రెడ్డి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టడంతో ఇప్పటికైనా పులివెందులలో తమ సత్తా చాటుకోవాలని, వారి ఆధిపత్యానికి గండి కొట్టాలని ఉబలాటపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. చాలా తర్జన భర్జనల అనంతరం చంద్రబాబు బుధవారం కడప పార్లమెంటు సభ్యుడిగా మైసూరారెడ్డి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి బిటెక్ రవిని ప్రకటించారు. అయితే మైసూరారెడ్డి అభ్యర్థిత్వంపై వ్యతిరేకత లేకున్నప్పటికీ పులివెందుల అభ్యర్థి బిటెక్ రవి అభ్యర్థిత్వంపై మాత్రం అభ్యర్థిని ప్రకటించగానే నియోజకవర్గం నుండి వ్యతిరేకత ప్రారంభమైంది.

తెలుగుదేశం పార్టీ జిల్లా నేత రామ్‌ గోపాల్ రెడ్డి బిటెక్ రవి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత దశాబ్దంన్నరగా పులివెందులలో వైయస్ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న వాళ్లో సతీష్‌రెడ్డితో పాటు రాంగోపాల్ రెడ్డి ఉన్నారు. వైయస్‌పై సతీష్ రెడ్డి నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. పార్టీకి ఆయన చేసిన సేవల దృష్ట్యా ఇటీవలె చంద్రబాబు సతీష్ రెడ్డిని ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించారు. అయితే ఈ ఉప ఎన్నికలలో తనకు టిక్కెట్ కేటాయించక పోవడంపై సతీష్ రెడ్డి తర్వాత పులివెందులలో వైయస్ కుటుంబాన్ని ఎదుర్కొన్న రాంగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

వైయస్ కుటుంబాన్ని ఎదుర్కొని పులివెందులలో టిడిపి క్యాడర్‌ను నిలబెట్టిన వారిలో రాంగోపాల్ రెడ్డి ఉన్నారు. పార్టీకి ఇన్ని సేవలు చేసినప్పటికీ తనను గుర్తించక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు టిక్కెట్ దక్కక పోవడంపై సిఎం రమేష్‌ను కారణంగా ఆయన చూపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయన టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగేందుకు సన్నద్దం అవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైయస్ కుటుంబమ మధ్య పొరపొచ్చలు కలిసి వస్తాయనుకుంటే టిడిపిలో రెబల్ అభ్యర్థి బరిలోకి దిగడంతో ఇప్పుడు మళ్లీ పులివెందుల ఎవరి వశం అవుతుందో చూడాలి.

కాగా రెబల్‌గా పోటీ చేస్తున్నాని వస్తున్న ఆరోపణలను రాంగోపాల్ రెడ్డి కొట్టి పారేసినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మాత్రం తనను విస్మరించిందని ఆయన ఆవేదన చెందారు. తాను రెబెల్‌గా పోటీ చేయాలని అనుకోవడం లేదని పార్టీ కార్యకర్తలు నుండి ఆ డిమాండ్ వస్తుందని అన్నారు. బిటెక్ రవి సరియైన వాడని భావించే చంద్రబాబు ఆయనను ప్రకటించారని అన్నారు. రవికి సహకరించే విషయం కాలం నిర్ణయిస్తుందని అన్నారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పార్టీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. అయినా సమస్యను కూర్చుని పరిష్కరించే దిశలో ఆలోచిస్తామన్నారు.

English summary
Pulivendula TDP leader Ram Gopal Reddy gave shock to TDP president Chandrababu Naidu. Ram Gopal Reddy very much disappointed with party attitude. He is thinking to contest as TDP rebel from Pulivendula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X