శంకరరావుకు కోపమొచ్చింది, పిఎపై చేయి చేసుకున్న మంత్రి
Districts
oi-Pratapreddy
By Pratap
|
విజయనగరం: చేనేత శాఖ మంత్రి శంకరరావుకు కోపం వచ్చింది. పీఏ సెల్ ఫోన్ మోగటంతో మంత్రి శంకరరావు అసహనం వ్యక్తం చేస్తూ అతని చెంప పగులగొట్టారు. ఈ ఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. మంత్రి చర్యతో అధికారులు బిత్తరపోయారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు పీఏకానీ, అధికారులు కానీ ఇష్టపడడం లేదు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంట్ స్థానానికి తాను పోటీ చేస్తానన్నా టిక్కెట్ ఇవ్వలేదని చేనేత శాఖ మంత్రి శంకర్రావు అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తానైతే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు. ఈసారి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ఫోటోలతో ప్రచారం చేస్తామని మంత్రి శంకర్రావు తెలిపారు.