వరంగల్: ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాన్వాయ్‌పై కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు సోమవారం గుడ్లు, టమాటాలో విసిరారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోమవారం పొన్నాల జ్యోతిరావుపూలే విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు. అయితే విద్యార్థులు ఆయన కాన్వాయ్‌ని అడ్డుకొని గుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి.
పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణిని కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో ఆమె వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.
OU students through eggs and tomatos on minister Ponnala Laxmaiah canvay today. They gave slogans against Ponnala. Students obstructed TDP MP Gundu Sudha Rani also. She went back.
Story first published: Monday, April 11, 2011, 13:08 [IST]