అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శవపేటికకు మేం ఆర్డర్డివ్వలేదు, ఓ భక్తుడు ఆర్డరిచ్చాడు: ట్రస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba Coffin
పుట్టపర్తి: సత్య సాయి బాబా కోసం తాము శవపేటికకు ఆర్డర్ ఇవ్వలేదని, ఓ భక్తుడు ఆర్డర్ ఇచ్చాడని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు మద్రాసు శ్రీనివాసన్ చెప్పారు. ఈ విషయంపై అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు మద్రాసు శ్రీనివాసన్‌తో పాటు ఇతర సభ్యులు సమాధానమిచ్చారు. అనుబంధ ప్రశ్నలకు అవకాశం లేదని మద్రాసు శ్రీనివాసన్ చెప్పారు. ట్రస్టు సభ్యుల్లో విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగానే ఉన్నాయని ఆయన అన్నారు. తాము ప్రభుత్వాన్ని సంప్రదించబోమని, ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన వివరించారు. చైర్మన్ ఎంపికపై మేనేజ్‌మెంట్ కౌన్సిల్, ట్రస్టీ బోర్డు నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు.

సత్య సాయి బాబా ఆరోగ్య స్థితిపై రోజుకు రెండు సార్లు వైద్యులు బులిటెన్ విడుదల చేశారని, బాబా ఆరోగ్యంపై ఊహించుకుంటే తాము ఏమీ చేయలేమని ఆయన అన్నారు. సత్యజిత్ సత్యసాయి విద్యాసంస్థల మాజీ విద్యార్థిని అని ఆయన చెప్పారు. సత్యజిత్‌ను తన వ్యక్తిగత సహాయకుడిగా సత్య సాయి బాబానే ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. ఐసియులోకి సత్య సాయిబాబా కుటుంబ సభ్యులను అనుమతించినట్లు ట్రస్టు సభ్యుడు, బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ చెప్పారు. తాను ఐసియులోనే ఉన్నానని, తమ కుటుంబ సభ్యులను ఏదో సమయంలో బాబాను చూడడానికి అనుమతి ఇచ్చామని ఆయన చెప్పారు. బాబా ఆస్పత్రిలో చేరడానికి ముందు బాబాకు అందించిన వైద్యంపై తాము చెప్పలేమని, అప్పుడు బాబానే తన ఇష్టప్రకారం వైద్యులను ఎంపిక చేసుకున్నారని శ్రీనివాసన్ చెప్పారు.

ఏం చేయాలనే విషయంపై తాము సత్య సాయిబాబాకు చెప్పేవారం కాదని, సత్యసాయి తన ఇష్టప్రకారం వ్యవహరించేవారమని, తాము బాబాను అనుసరించే భక్తులం మాత్రమేనని ఆయన చెప్పారు. ట్రస్టు ఆభరణాలను, బంగారాన్ని తరలించలేదని ఆయన చెప్పారు. తన ఆరోగ్యంపై తన వైద్యులను సంప్రదించి సత్య సాయి స్వయంగా నిర్ణయాలు తీసుకునేవారని ఆయన చెప్పారు. సమాధి వద్ద పాటించాల్సిన నిబంధనలపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

English summary
Sri Sathya Sai central trust member Madras Srinivasan said that they have not ordered for coffin. He said that it was sent by a devotee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X