సమైక్యవాదులే లాడెన్లు, కెసిఆర్‌పై కేసులు సమైక్యవాదమా: హరీష్ రావు

పోలీసు శాఖలో 610 జీవోను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవోను అమలు చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏడాది దాటుతోందని, అయినా ప్రభుత్వం అమలు చేయించడం లేదని ఆయన అన్నారు. పోలీసు శాఖలో తెలంగాణవారికి అన్యాయం చేసే విధంగా ఉద్యోగ నియామకాలను ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. లేకపోతే తాము సబితా ఇంద్రా రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications