వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రణాళికా సంఘం తీరుపై ఎగిరి గంతేసిన కిరణ్ కుమార్ రెడ్డి

ప్రస్తుత ప్రణాళిక నిరుటి ఆర్థిక ప్రణాళిక కన్నా 17 శాతం ఎక్కువని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42 వేల 915 కోట్ల రూపాయలకు ఆర్థిక ప్రణాళిక ప్రతిపాదనలను ప్రణాళికా సంఘానికి సమర్పించింది. వ్యవసాయానికి, దాని ఆధారిత పరిశ్రమలకు 3,189 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి 925 కోట్ల రూపాయలు కేటాయించారు. ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులతో సమావేశమై వార్షిక ప్రణాళికను ఖరారు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రతిపాదనల్లో ప్రణాళికా సంఘం ఏ విధమైన కోతలు పెట్టలేదు.